మత్తెక్కిస్తోన్న 'మెహబూబా' అందాలు

మరిన్ని వార్తలు

పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మెహబూబా' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోన్న కొత్తందం నేహా శెట్టి. వస్తూ వస్తూనే, తన హాట్‌ హాట్‌ గ్లామర్‌ అప్పియరెన్స్‌తో అగ్గి రాజేస్తోందీ బ్యూటీ. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది ఈ సినిమా. కాగా మరో పక్క హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో ఈ బ్యూటీ ఎంట్రీకి ముందే సోషల్‌ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్‌ పెంచేసుకుంటోంది. తాజాగా ఈ ఫోటోలు చూస్తే మీకే అర్ధమవుతుంది ఈ బ్యూటీ ఎంతగా గ్లామర్‌ షో చేస్తోందో. సినిమాలో ఇలాంటి హాట్‌ అప్పీల్‌ ఇంకా చాలానే ఉంటుందట. కామన్‌గా పూరీ సినిమాల్లో హీరోయిన్‌ గ్లామర్‌పై ఫోకస్‌ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమాలో నేహా శెట్టి అందాలను మరింత గ్లామరస్‌గా చూపించాడని తెలియవస్తోంది. తాజా పిక్స్‌లో షార్ట్‌ జీన్స్‌, బ్లాక్‌ అండ్‌ రెడ్‌ చెక్స్‌ షర్టులో నేహా శెట్టి గ్లామర్‌ స్టైల్‌ సింప్లీ సూపర్బ్‌ అనిపిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS