పూరి బ్రాండ్‌ - కొత్త భామ కెవ్వు కేక

మరిన్ని వార్తలు

తెలుగు తెరకు మరో మెరుపుతీగ ఎంట్రీ ఇవ్వబోతోంది. డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ ఈ ముద్దుగుమ్మని పరిచయం చేస్తున్నాడు టాలీవుడ్‌కి. ఆమె నేహాశెట్టి. 'ముంగారుమలై - 2' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ భామ, తెలుగుతో ఆకాష్‌ పూరీ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. పూరీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. పూరీ హీరోయిన్స్‌ గ్లామర్‌లో టాప్‌ లేపేస్తారు. అలాగే ఈ బ్యూటీ కూడా టాపు లేపే గ్లామర్‌ని చూపించనుందట. సోషల్‌ మీడియాలో అమ్మడు ఇప్పటికే హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌ స్టార్ట్‌ చేసేసింది. ఆ హాట్‌ పిక్స్‌లో ఈ ముద్దుగుమ్మ కెవ్వు కేక పుట్టిస్తోందంతే! పూరి పరిచయం చేసిన కన్నడ బ్యూటీస్‌లో రక్షిత తెలుగులో దాదాపు అగ్రహీరోలందరితోనూ నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇప్పుడీ నేహా కూడా తెలుగులో సత్తా చాటుద్దేమో చూడాలిక.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS