నవ్వించడానికి వస్తున్న మెగా హీరోయిన్‌

మరిన్ని వార్తలు

'ఒక మనసు' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది మెగా హీరోయిన్‌ నిహారిక. ఆ తర్వాత తెలుగులో నిహారిక సినిమా చేయలేదు. కానీ ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ గతంలోనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. 

తమిళ సినిమా అయినప్పటికీ, నిహారికకు తెలుగులో డైలాగులుండడం ట్రైలర్‌లో ఆశ్చర్యకరంగానూ, ఒకింత ఇంట్రెస్టింగ్‌గానూ అనిపించింది. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గౌతమ్‌ కార్తీక్‌, గాయత్రి ఇతర ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నిహారిక పాత్ర పరిధి ఎంత అనేది పక్కన పెడితే, పోస్టర్స్‌లో నిహారిక నవ్వుతూ చలాకీగా కనిపిస్తోంది. ఇదో కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం. నిహారిక పాత్ర చాలా బాగా నవ్విస్తుందట. నిహారిక గెటప్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఫన్నీగా అనిపిస్తోంది పోస్టర్స్‌ చూస్తుంటే. 

 

తెలుగులో తొలి సినిమాలో సీరియస్‌గా కనిపించింది నిహారిక. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు కూడా. అయితే తమిళంలో తొలి సినిమాపై అంచనాలున్నాయి. పోస్టర్స్‌తోనే సినిమాపై ఆశక్తి కలిగిస్తోంది. ఇంత ఆశక్తికరంగా ఉన్న ఈ సినిమాలో నిహారిక క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోందోనని మెగా అభిమానులు ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, మన తెలుగమ్మాయి, అందులోనూ మెగా ముద్దుగుమ్మ తమిళంలో హీరో విజయ్‌ సేతుపతి సినిమాలో నటిస్తుండగా.. తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఇటు తెలుగులో మెగాస్టార్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'సైరా'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (చిరంజీవి) పాత్రకు ముఖ్య అనుచరుడి పాత్రలో విజయ్‌ సేతుపతి నటిస్తుండడం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS