ఇట్స్‌ నాట్‌ 'లై' ఈ సారి కెమిస్ట్రీ అదిరిపోద్దట

మరిన్ని వార్తలు

'లై' సినిమాతో జత కట్టిన జోడీ నితిన్‌ - మేఘా ఆకాష్‌. సినిమా ఆశించిన విజయం అందుకోకపోవడంతో ఈ జంట ఆకట్టుకోలేకపోయిందనే కామెంట్స్‌ వచ్చాయి. కెమిస్ట్రీ కొంచెం ఓవర్‌ డోస్‌ అయ్యిందంటూ విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ సారి కూడా ఈ ఇద్దరే జత కడుతున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న నితిన్‌ తాజా చిత్రంలో మళ్లీ మేఘా ఆకాషే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ అందించిన కథతో రూపొందుతోంది ఈ చిత్రం. కాగా ఇప్పుడు అందరి దృష్టి నితిన్‌ - మేఘా ఆకాష్‌ జంటపైనే. ఎందుకంటే తొలి సినిమాతో సరిగా ఆకట్టుకోలేకపోయిన ఈ జంట ఈ సారి ఏం చేస్తుందో అనుకుంటున్నారంతా. 

అయితే ఈ సారి మాత్రం వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీ అదిరిపోనుందంటూ చిత్ర యూనిట్‌ సంకేతాలు పంపిస్తోంది. యాక్టింగ్‌ పరంగా తొలి సినిమాకి ముద్దుగుమ్మ మేఘా ఆకాష్‌ ఓకే అనిపించినా, ఈ సారి నటనలో కూడా నితిన్‌ సూచనలతో కొంచెం పరిణితి చెందిందట. అలాగే డాన్సుల్లోనూ, ఎక్స్‌ప్రెషన్స్‌లో కూడా ప్రత్యేకంగా కేర్‌ తీసుకుంటోందనీ సమాచారమ్‌. 'అ,ఆ..' సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్న నితిన్‌ 'లై'తో కొంచెం డీలా పడ్డాడు. కానీ ఈ సారి మాత్రం పక్కా ప్రణాళికతో వస్తున్నాడనీ తెలుస్తోంది. 

మరో పక్క సందీప్‌ వంగా దర్శకత్వంలో నితిన్‌ ఇంకో సినిమాకి కమిట్‌ అయ్యాడట. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించే యోచనలో నితిన్‌ ఉన్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS