'లై' టీజర్‌ వచ్చేస్తోందిలా!

మరిన్ని వార్తలు

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా 'లై'. నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్‌ నటుడు అర్జున్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. లవ్‌, ఇంటెలిజెన్స్‌, ఎనిమి అనే ఈ మూడు కాన్సెప్ట్‌ల చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుందట. కథ, కథనాలు అన్నీ చాలా కొత్తగా తెరకెక్కించారట డైరెక్టర్‌ హను రాఘవపూడి. టైటిల్‌కి తగ్గట్లుగానే సినిమా ఆధ్యంతం ఆశక్తిగా సాగుతుందంటున్నారు. నితిన్‌ కొత్త గెటప్‌ సినిమాకి స్పెషల్‌ ఆకర్షణ. ఇక సీనియర్‌ నటుడు అర్జున్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో తాను విలన్‌ కాదనీ, చాలా ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రలో తాను కనిపించబోతున్నాననీ ఆయన వివరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా పోస్టర్స్‌ మాత్రం ఆయన్ని విలన్‌గా అర్ధం చేసుకునేలానే ఉన్నాయి. అలాగే చాలా పవర్‌ ఫుల్‌ పాత్రలో ఆర్జున్‌ కనిపించబోతున్నాడనీ పోస్టర్స్‌ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకూ పోస్టర్స్‌లోని స్టిల్స్‌ ద్వారా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిన 'లై' టీజర్‌ రేపే విడుదల కానుంది. టీజర్‌ వచ్చినాక సినిమాపై అంచనాలు అంచనాలు మరింత పెరిగిపోతాయని చిత్ర యూనిట్‌ నమ్మకం వ్యక్తం చేస్తోంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' అంటూ నాని సినిమాకి లాంగ్‌ టైటిల్‌ పెట్టి, విశేషంగా ఆకట్టుకున్న హను ఇప్పుడు 'లై' అని సింగిల్‌ లెటర్‌ టైటిల్‌తో ఇంకెంతగా ఆకట్టుకుంటాడో చూడాలిక. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS