నితిన్‌ 'అబద్ధం' చెబుతున్నాడు!

మరిన్ని వార్తలు

హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సినిమా టైటిల్‌ ఏంటో తెలుసా? 'లై' చాలా కొత్తగా ఉంది కదా. లవ్‌, ఇంటెలిజెన్స్‌, ఎనిమిటీ అని 'లై'కి నిర్వచనం ఇచ్చేశారు ఫస్ట్‌ లుక్‌తోనే. నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్‌ విడుదల చేశారు. నితిన్‌ కొత్త మేకోవర్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. 'అఆ' లాంటి కూల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేశాడు నితిన్‌. ఈ సినిమాలో చాలా హ్యాండ్‌సమ్‌గా పల్లెటూరి అబ్బాయిలా కనిపించి మెప్పించాడు. కానీ ఈ సారి అలా కాదు. మాస్‌ అండ్‌ ఇంటెలిజెంట్‌ థ్రిల్లర్‌ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీలా కనిపిస్తోంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో కూల్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించిన డైరెక్టర్‌ హను రాఘవపూడి. ఈసారి కొత్త సబ్జెక్ట్‌తో వస్తున్నాడు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఫస్ట్‌లుక్స్‌తోనే నితిన్‌ అదరగొట్టేస్తున్నాడు. చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. గెడ్డంతో స్టైలిష్‌ లుక్‌తో చాలా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాడు నితిన్‌. రాజమౌళి దర్శకత్వంలో నితిన్‌ 'సై' సినిమా చేశాడు, ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో అదే తరహాలో సౌండింగ్‌ ఉన్న 'లై' చేస్తున్నాడు. 'సై' సినిమాలా 'లై' కూడా నితిన్‌కి పెద్ద హిట్‌ ఇవ్వాలని కోరుకుంటూ నితిన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS