మహానటిలో ‘ఎన్టీఆర్’ లేనట్టేనా?

మరిన్ని వార్తలు

మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారం చేసుకుని తీస్తున్న చిత్రం- మహానటి. ఈ చిత్రం టీజర్ మొన్ననే విడుదలవ్వడం అందరి ఆదరణ పొందడం కూడా జరిగిపోయాయి.

ఇక ఈ చిత్రంలో దాదాపుగా ఒక 10 మందికి పైగా ప్రముఖ నటులు ఈ చిత్రంలో ప్రముఖుల పాత్రల్లో నటిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారు అన్న కోణంలో పుఖార్లు షికారు చేశాయి. అయితే ఈ తరుణంలో ఆయన పాత్ర గురించి ఆరా తీయగా- ఆయన కేవలం ఒక్క షాట్ లో కనిపిస్తారు అని అందులో కూడా పాత చిత్రంలోని ఒక సన్నివేశం వేస్తారు అని తెలిసింది.

దీనితో మహానటి చిత్రంలో ఎన్టీఆర్ ని చూద్దాము అని అనుకునే అందరికి ఇదొక చేదు వార్తే అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఏఎన్ఆర్ పాత్రలో ఆయన మనువాడు నాగ చైతన్య కనిపిస్తున్నాడు అన్న సంగతి విదితమే.

మొత్తానికి ఈ సినిమా విడుదలైతే మరిన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS