పద్మావతికి ఇంత ఖర్చు పెట్టారా?!

మరిన్ని వార్తలు

సంజయ్ లీలా భన్సాలి అంటేనే భారీ చిత్రాల నిర్మాణానికి కేర్ అఫ్ అడ్రస్ గా వినపడే పేరు. ఆయన తాజా చిత్రం పద్మావతి ఇప్పుడు బాలీవుడ్ నాట పెద్ద చర్చకే దారితీసింది.

వివరాల్లోకి వెళితే, పద్మావతి చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదలయింది. దీనికి అక్షరాల రూ 3.50కోట్ల మేర ఖర్చు పెట్టినట్టు సమాచారం అందుతున్నది. అయితే ఇప్పటికే సుమారు రూ 300కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

కాకపోతే మరీ ఫస్ట్ లుక్ కోసం ఇంతలా ఎవరైనా ఖర్చు చేస్తారా అన్న విషయం ఇప్పుడు పెద్ద చర్చ మొదలయింది. అయితే భారీతనానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే సంజయ్ ఇప్పుడు కూడా అదే తరహాలో ఖర్చు చేసి ఉంటాడు అన్న వాదనలు వినపడుతున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS