అజ్ఞాతవాసి ఆఫీస్ వద్ద తోపులాట

మరిన్ని వార్తలు

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఆడియో విడుదల రేపు అవ్వనున్న నేపధ్యంలో రేపటి ఆడియో విడుదల పాసుల కోసం ఆయన అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అభిమానులు నేటి ఉదయం నుండే అజ్ఞాతవాసి ఆఫీస్ వద్ద భారులు తీరారు. కారణమేంటంటే- రేపటి ఆడియో విడుదల పాసులు అజ్ఞాతవాసి ఆఫీస్ లో ఇస్తున్నారన్న ప్రచారం జరగడం. అయితే ఈ పాసులకి సంబంధించి సమాచారం ఎవరు ఇవ్వకపోవడంతో అక్కడికి వచ్చిన వారంతా తీవ్ర నిరాశకి గురయ్యారు.

వచ్చిన అభిమానులని అదుపు చేసేందుకు నిర్మాణ సంస్థ వారు బౌన్సర్స్ ని సైతం మోహరించింది. ఇక కొద్దిసేపటి క్రితమే అభిమానుల సంఖ్య పెరగడం, పాసులకి సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఒక్కసారిగా వారంతా ఆఫీస్ లోపలి వెళ్ళే ప్రయత్నం చేయడంతో స్వల్ప తోపులాట జరిగింది.

అయితే వెంటనే అక్కడే ఉన్న బౌన్సర్స్ పరిస్థితిని అదుపులోకి తేవడం జరిగింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS