పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తమిళంలో...

మరిన్ని వార్తలు

ఈ సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం సాధారణ ప్రేక్షకులతో పాటుగా పవన్ కళ్యాణ్ అభిమానులని సైతం తీవ్ర నిరాశపరిచింది. అయితే ఈ అజ్ఞాతవాసి సినిమాకి తమిళంతో లింకులు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కి ఫ్రీమేక్ అన్న సంగతి ఇప్పటికే అర్ధమవ్వడం జరిగిపోయింది. అయితే కొంతకాలం క్రితం దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ ఫ్రెంచ్ సినిమా ఆధారంగానే ఒక చిత్రాన్ని హీరో విజయ్ తో తీయాలనుకోవడం అదే పనిగా టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ కూడా విడుదల చేశాడు. ఏమైందో తెలియదు కాని కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు.

ఈ విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం ఫ్లాప్ అయ్యేటప్పటికి బయటకి వచ్చింది. కారణాలు తెలియకపోయినప్పటికీ ఈ సినిమా విజయ్ చేసి ఉంటే తమ హీరో పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ ఫ్లాప్ చిత్రం ఉండేది కాదు అని పవన్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

అయినా ఫ్లాప్ వచ్చింది కాబట్టి ఇలా అంటున్నారు కాని అదే ఒక వేళ హిట్ అయి ఉంటే ఇదే మాట అంటారా ఏంటి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS