పాట అదిరింది రాయుడూ

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ సినిమా 'కాటమరాయుడు' పాట రిలీజ్‌ అయ్యింది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆడియో సింగిల్‌ని సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. మిర్ర మిర్రా మీసం.. అంటూ సాగే ఈ రాయుడు పాట అదిరిపోతోంది. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు ఈ పాట కోసం. టీజర్‌లో చిన్నగా వినిపించారు. రాయుడూ.. అంటూ. ఇప్పుడు పూర్తి పాట వింటుంటే దద్దరిల్లి పోతోంది. శృతిహాసన్‌ కథానాయకిగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ రాయుడు పాత్రలో నటిస్తున్నాడన్న సంగతి తెలుసిందే. పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. తమిళంలో ఘన విజయం సాధించిన 'వీరమ్‌'కి తెలుగు రీమేకే ఈ సినిమా. పవన్‌ కళ్యాణ్‌ కోసం మాతృకలో చాలా మార్పులు చేశారు. ఇటీవల విడుదలైన టీజర్‌ రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకుంటోంది. ఇక ఇప్పుడు ఈ పాట వంతు వచ్చింది. సోషల్‌ మీడియాలో విడుదలైన కొద్దిసేపటికే దుమ్ము దులిపేస్తోంది ఈ ఆడియో సింగిల్‌. అనూప్‌ రూబెన్స్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందించారు. కిషోర్‌ కుమార్‌ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి శరత్‌ మరార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నాడు పవన్‌ ఈ సినిమాలో. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' నిరాశ పరచడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS