అల్లు అరవింద్ పై పవన్ సెటైర్

By iQlik Movies - December 07, 2017 - 04:29 PM IST

మరిన్ని వార్తలు

అల్లు అరవింద్ పైన కొద్దిసేపటి క్రితం రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

 

ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు తనని అల్లు అరవింద్ & కో ఒక సాధారణ నటుడిగానే గుర్తించారు తప్ప, ఒక రాజకీయ పరిణితి గల వ్యక్తిలా చూడలేదు అని ఆరోపించాడు. తాను ఏ మీటింగ్ కి అయినా వెళ్ళాలి అని అనుకుంటే తన స్థానంలో రామ్ చరణ్ ని గాని అల్లు అర్జున్ ని గాని పంపేవాడని గుర్తుచేసుకున్నాడు.

ఇక తాను సమాజంలో మార్పు కోసం రాజకీయాల పైన అవగాహనతోనే ప్రజారాజ్యంలో పనిచేయడానికి వచ్చానని అది వారి గుర్తించకపోవడంతోనే అక్కడ తాను ఇమడలేకపోయాను అని చెప్పాడు.

మొత్తానికి ప్రజారాజ్యం పార్టీ సమయంలో తన అన్న చిరంజీవిని మోసం చేసిన వారిని వదిలిపెట్టను అని ప్రకటించాక నిర్మాత అల్లు అరవింద్ పైన ఈ సెటైర్ వెయ్యడం చర్చనీయంశంగా మారింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now