పెళ్ళి పీటలెక్కనున్న ప్రముఖ హాస్యనటుడు

మరిన్ని వార్తలు

నా సావు నేన్ సస్థ... నీకెందుకు.. ఈ డైలాగ్ వినగానే గుర్తొచ్చే హాస్యనటుడు ప్రియదర్శి. పెళ్ళి చూపులు సినిమాలో కౌశిక్ పాత్రతో తెలుగు తెరకి పరిచయం అయిన ఈ హాస్యనటుడు ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సినిమాల మీద సినిమాలు చేస్తున్న నటుడు. 

ఇక వచ్చే నెలలో ప్రియదర్శి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 7గంటలకు రిచా  శర్మతో హైదరాబాద్ లో ఆయన వివాహం జరగబోతున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి శుభలేఖలు కూడా ఇప్పటికే బంధువులకి ఇచ్చినట్టు సమాచారం. 

ఆ పెళ్ళి పత్రికలకి సంబంధించి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ప్రియదర్శి మాత్రం తన పెళ్ళికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంతవరకు చేయలేదు. 

ఈ శుభసందర్భంలో ప్రియదర్శికి మా www.iQlikmovies.com తరపున పెళ్ళి శుభాకాంక్షలు.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS