బంపర్‌ ఛాన్స్‌ వదిలేసుకున్న ప్రియమణి

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ ప్రియమణి ఏమైపోయిందో ఎవరికీ తెలియదు అనుకుంటున్న సమయంలో ప్రియమణికి ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. సెల్వ దర్శకత్వంలో అరవింద్‌ స్వామి నటిస్తున్న ఓ సినిమాలో ఛాన్స్‌ వచ్చిందట. అవకాశాలే లేని టైంలో వచ్చిన ఈ ఛాన్స్‌ని వద్దనుకుందట. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర హీరోయిన్‌గా కాదట. అరవింద్‌ స్వామి హీరోగా వస్తోన్న ఈ సినిమాలో హీరో స్నేహితురాలిగా నటించే పాత్రట అది. అందుకే ఆ క్యారెక్టర్‌పై ప్రియమణి ఇంట్రెస్ట్‌ చూపలేదని సమాచారమ్‌. ఆ పాత్రలో నటించడానికి మరో సీనియర్‌ భామ సిమ్రాన్‌ని ఎంపిక చేశారని తెలియవస్తోంది. ప్రియమణి వదిలేసుకున్న ఆ పాత్ర పోలీస్‌ కావడం గమనించదగ్గది. అయితే తెలుగులోనూ, తమిళంలోనూ హ్యాండ్‌సమ్‌ హీరో అరవింద్‌ స్వామికి ఇప్పుడు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవలే తెలుగులో 'ధృవ' సినిమాలో విలన్‌ పాత్రలో నటించాడు. ఆ పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణ. అందులోనూ అరవింద్‌స్వామి ఆ పాత్రకి మరింత ప్రాధాన్యతనీ, స్టైల్‌నీ తీసుకొచ్చాడు. దాంతో తెలుగులో అరవింద్‌స్వామికి బోలెడంత అభిమానం తోడయ్యింది. అలాగే తమిళంలో 'తని ఒరువన్‌', 'బోగన్‌' తదితర సినిమాల్లో నటించి దూసుకెళుతున్నాడు. ఈ తరుణంలో ప్రియమణి ఈ సినిమాలో నటించి ఉంటే ఆమె కెరీర్‌కి హెల్ప్‌ అయ్యేదని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS