పూరి-రోహిత్ సినిమా ఆగిపోయింది

మరిన్ని వార్తలు

ఈ టైటిల్ చూసి అసలు ఈ కలయికలో ఎప్పుడు సినిమా ప్రకటించారు అని ఆలోచించకండి. ఈ వార్త నిజమే కాని, ఈ కలయికతో సినిమా వచ్చే అవకాశం దాదాపు 9 యేండ్ల క్రితం జరిగిన మాట వాస్తవం. 

వివరాల్లోకి వెళితే, నారా రోహిత్ సినిమాలలోకి రంగప్రవేశం చేద్దాము అని అనుకున్నప్పుడు ఆయన మొదటి చిత్రం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేద్దాము అని అంత అనుకున్నరాట. అయితే రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలని చేయడం ఒక రెగ్యులర్ హీరో అనిపించుకోవడం నచ్చని నారా రోహిత్ ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నారట. 

ఇక ఆ తరువాత చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన బాణం చిత్రంతో తెలుగు చిత్రసీమకి పరిచయం అయ్యారు. ఆ చిత్రం నుండే నారా రోహిత్ కి ఒక వైవిధ్యమైన కథలని చేసే హీరోగా ఒక ప్రత్యేక గుర్తింపు కూడా రావడం జరిగింది. 

ఇదిలావుండగా తరువాత కాలంలో కూడా ఇక కమర్షియల్ జోలికి వెళ్ళని నారా రోహిత్ కి దర్శకుడు పూరితో పనిచేసే అవకాశం రాలేదు. ఏమో భవిష్యత్తులో ఈ కలయికలో ఏదైనా చిత్రం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS