నేనెవరికీ పోటీ కాదు: పీపుల్స్‌ స్టార్‌

మరిన్ని వార్తలు

పీపుల్స్‌ స్టార్‌ నారాయణమూర్తి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సినిమాలే చేస్తారు. ఆయన సినిమాల నుంచి కమర్షియల్‌ అంశాల్ని ఆశించకూడదు. అయినప్పటికీ కూడా కమర్షియల్‌ విజయాలు సాధిస్తాయి ఆయన సినిమాలు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా పీపుల్స్‌ స్టార్‌, రెడ్‌ స్టార్‌ అనే గుర్తింపు తెచ్చుకున్న నారాయణమూర్తి, చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చేస్తున్న సినిమా 'హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య' ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెద్ద సినిమాలతోపాటుగా వస్తున్న ఈ సినిమాకి మొదట థియేటర్ల సమస్య వచ్చింది. దానిపై ఆయన కొంత కలత చెందారు కూడాను. ఇప్పుడా సమస్య సద్దుమణిగిందని ఆయనే స్వయంగా చెప్పారు. బాలకృష్ణ, చిరంజీవి, శర్వానంద్‌ సినిమాలతోపాటుగా తన సినిమా కూడా విజయవంతమవుతుందని ఈ సంక్రాంతి తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ఆనందాలను ఇస్తుందని అంటున్నారాయన. ఎవరికీ తన సినిమా పోటీ కాదని ఆయన స్పష్టం చేశారు. వారి సినిమాల రేంజ్‌, వాటి పట్ల అభిమానుల్లో ఉండే అంచనాలు భిన్నమనీ, తన సినిమాకి కూడా కొందరు ప్రేక్షకులు ఉన్నారని, ఆ ప్రేక్షకులతోపాటుగా మిగతా ప్రేక్షకులు కూడా ఆశీర్వదిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు ఆర్‌.నారాయణమూర్తి. ఈ సినిమాలో నారాయణమూర్తి సరసన జయసుధ నటిస్తుండగా, ఇది బ్లాక్‌ మనీపై తీసిన చిత్రమట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS