రవితేజకి రాశి ఖన్నా స్పెషల్ అట!

మరిన్ని వార్తలు

టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఈ క్రింద చదవండి.

రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కోసం రాశి ఖన్నాని తీసుకున్నారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సాయి కార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇప్పటికే రాజా ది గ్రేట్ చిత్రానికి సంబందించిన టీజర్ హిట్ అవ్వగా ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ తో ప్రేక్షకులకి ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరగనున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తుది దశకి చేరుకుంది.

మరి రాశి ఖన్నా స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి స్పెషల్ గా మారనుందా లేదా అనేది తెలియాల్సివుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS