తెలంగాణా నుండి రకుల్ ప్రీత్...

By iQlik Movies - October 12, 2017 - 12:43 PM IST

మరిన్ని వార్తలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం- భేటీ బచావో భేటి పడావో. ఈ పథకాన్ని  దేశంలోని ప్రతి రాష్ట్రంలో అమలు అయ్యేలా చూడమని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సైతం ఆయన వ్యక్తిగతంగా చెప్పడం విశేషం.

ఇక ఆ పథకాన్నితెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే క్రమంలో ఆ పథకాన్ని కింది స్థాయి వరకు చేర్చే ఆలోచనతో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ ని ఈ పథకానికి మన రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభుత్వం నియమించింది.

దీనికి సంబందించిన ప్రకటన కూడా వెలువడింది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ తన సమ్మతిని వ్యక్తం చేస్తూ- ఈ పథకం అవసరమైన వాళ్ళకి చేర్చే విధంగా తనవంతు సహాయం చేస్తాను అని తెలిపింది.

ఇక పలువురు సెలబ్రిటీలు రకుల్ ప్రీత్ కి శుభాకాంక్షలు తెలియచేశారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now