కార్తితో రకుల్‌ కొత్త కొత్తగా

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్య విభిన్నమైన కథల్ని ఎంచుకుంటోంది. కథలు కమర్షియల్‌ అయినప్పటికీ, తన పాత్రల్లో వేరియేషన్స్‌ చూసుకుంటోంది. ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తోంది. 'రారండోయ్‌ వేడుక చూద్దాం..' సినిమాలో ట్రెడిషనల్‌ లుక్‌లో అలరించిన ఈ ముద్దుగుమ్మ 'జయ జానకి నాయకా' సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రతో ఆకట్టుకుంది. ఈ నెల్లోనే మహేష్‌బాబుతో 'స్పైడర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రకుల్‌ పాత్ర డిఫరెంట్‌గా ఉండబోతోందట. అలాగే ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్ర కూడానట. మురుగదాస్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటిస్తోన్న సినిమా 'ఖాకీ' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ అయ్యింది. చాలా కొత్తగా కనిపిస్తోంది రకుల్‌ ఈ సినిమాలో. కార్తి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కార్తి పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్‌ లుక్‌ చాలా ప్లెజెంట్‌గా ఉంది. రకుల్‌ సరికొత్తగా కనిపిస్తోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆటిట్యూడ్‌ చాలా గొప్పది. కమిట్‌మెంట్‌తో ఉంటుంది ఏ సినిమా చేసినా. ఈ సినిమా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్‌, కార్తి జంట చూడ ముచ్చటగా ఉంది. ఈ ఫోటోని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో 'ఖాకీ' తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ చాలా చాలా సరదాగా జరిగిందనీ, కార్తితో నటించడం చాలా సంతోషంగా ఉందనీ రకుల్‌ అభిమానులతో ముచ్చటించింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS