బాబాయ్ నా గుండెల్లో ఉంటాడు: రామ్ చరణ్

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న జరిగిన దర్శకుడు ఆడియో విడుదల కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. 

ఆ కామెంట్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన అవ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. చెర్రీ మాట్లాడుతుండగా- పవర్ స్టార్... పవర్ స్టార్.. అని నినాదాలు చేయగా.. తనకి తన కుటుంబం ఎల్లప్పుడు గుండెల్లో ఉంటుంది. అలా తన గుండెల్లో ఉన్న వారి గురించి ఎక్కువగా మాట్లాడలేము అని అందుకే తన కుటుంబసభ్యుల గురించి పెద్దగా మాట్లాడను అని చెప్పాడు.

బాబాయ్ ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం హోరెత్తింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కి పవర్ స్టార్ కి మధ్య కొంత గ్యాప్ ఉంది అని వచ్చే పుకార్లకీ రామ్ చరణ్ సరైన సమాధానం చెప్పాడు అని అభిప్రాయపడుతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS