చరణ్‌ మళ్లీ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు..!

By iQlik Movies - February 14, 2018 - 05:24 PM IST

మరిన్ని వార్తలు

కొరటాల శివతో చరణ్‌ ఓ సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. కానీ కుదరడం లేదు. నిజానికి 'ధృవ'కి ముందే కొరటాలతో చరణ్‌ సినిమా చేయాల్సి ఉంది. కానీ 'ధృవ', తర్వాత 'రంగస్థలం' ఇప్పుడు తాజాగా బోయపాటి శీనుతో సినిమా ..ఇలా స్పేస్‌ దొరకడం లేదు చరణ్‌కి. 

'శ్రీమంతుడు' సినిమా తర్వాత చరణ్‌తోనే కొరటాల సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఇప్పటికీ సెట్‌ కాలేదు. అది ఇంకా ఎప్పటికి సెట్‌ అవుతుందో తెలీయడం లేదు కానీ, బోయపాటి శీనుతో చరణ్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమా కంప్లీట్‌ అయ్యేందుకు మరింత టైం పట్టనుంది. ప్రస్తుతం మహేష్‌బాబుతో 'భరత్‌ అనే నేను' సినిమాతో బిజీగా ఉన్న కొరటాల శివ ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడనే విషయంపై సస్పెన్స్‌ నెలకొంది. 

కొరటాల - చరణ్‌ కాంబో సంగతి అటుంచితే, అల్లు అర్జున్‌తో కొరటాల సినిమా ఉందంటూ మరోవైపు గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. కానీ కొరటాల మాత్రం చరణ్‌ సినిమా కోసమే ఎదురు చూస్తున్నాడనీ తెలుస్తోంది. ఒక రకంగా చరణ్‌తో సినిమా ఇప్పట్లో వర్కవుట్‌ అయ్యేలా కనిపించడం లేదు. అల్లు అర్జున్‌ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఈ సమ్మర్‌కి రిలీజ్‌ కానుంది. అలాగే కొరటాల శివ - 'భరత్‌ అనే నేను' కూడా ఈ సమ్మర్‌కే రానుంది. 

సో ఆ రకంగా చూస్తే, ఈ ఇద్దరూ ఈ సినిమాల తర్వాత ఫ్రీ అయిపోనున్నారు. అంటే ఈ కాంబినేషన్‌ వర్కవుట్‌ అయ్యేందుకే ఎక్కువ ఛాన్సెస్‌ ఉన్నాయి. చూడాలి మరి బన్నీ - కొరటాల కాంబినేషన్‌ గాసిప్‌ నిజమవుతుందో లేదో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now