గోదావరి జిల్లాల్లో హల్చల్ చేస్తున్న మెగా హీరో

మరిన్ని వార్తలు

దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న కొత్తతరహా చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక వైవిధ్యమైన పాత్రలో మేరవనున్నాడు.

ఇదిలా ఉంటే, ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. దీనితో షూటింగ్ విరామ సమయంలో తన భార్య అయిన ఉపాసనతో కలిసి గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాల్లో పర్యటిస్తున్నాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలని తన సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది.

ఇక ఈ పర్యటనలో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకి పేరంటాళ్ళపల్లి గ్రామమంలో ఒక చిన్న కుర్రాడు హుషారుగా రామ్ చరణ్-ఉపాసనలకి తమ గ్రామం మొత్తం తిప్పి చూపించడంతో మెగా పవర్ స్టార్ ఆశ్చర్యపోయాడట.

మీరు ఫోటోలో గమనిస్తే, ఆ చిన్న పిల్లాడ్ని తన ఒడిలో కూర్చోపెట్టుకుని మరి ఫోటో దిగాడు రామ్ చరణ్. ఏదైతే ఏంటి, రామ్ చరణ్ మాత్రం ఈ షూటింగ్ వల్ల అచ్చ తెలుగు పల్లెటూర్ల అందాలను ఆస్వాదిస్తున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS