రంగస్థలం 1985 ఫస్ట్ లుక్ రిలీజ్ వచ్చేస్తుంది

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘రంగస్థలం 1985’ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ గురించి చూస్తున్న ఎదురు చూపులకి సమాధానం దొరికేసింది.

రేపు సాయంత్రం 5.30 గంటలకు రంగస్థలం 1985 చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదల తేదీలు మారిపోతు ఉండడంతో ఫ్యాన్స్ లో ఒకరకమైన నిరాశ నెలకొంది.

మరి ఈ ఫస్ట్ లుక్ అభిమానులని ఎంతవరకు ఆకట్టుకోగలదు అన్నది రేపు సాయంత్రానికి గాని తెలియదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా సమంతా నటిస్తుండగా తమిళ హీరో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనపడనున్నాడు.

మొత్తానికి రంగస్థలం చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేస్తున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS