'ఛలో'తో షురూ - కొత్త భామ గురూ!

మరిన్ని వార్తలు

'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోన్న బ్యూటీ రష్మికా మండన్నా. ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మ రష్మికా మండన్నా గురించి చెప్పుకోవాల్సిందే. ఈ బ్యూటీలో ఏదో మ్యాజిక్‌ ఉంది. మలయాళంలో 'కిరిక్‌ పార్టీ' చిత్రంలో నటించిందీ బ్యూటీ. తెలుగులోకి ఎంట్రీ కాకముందే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. 

టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే సెన్సేషనల్‌ హీరోయిన్‌ అనిపించుకుంది ముద్దుగుమ్మ సాయి పల్లవి. 'ఫిదా' సినిమాతో నిజంగానే అందర్నీ ఫిదా చేసేసింది. ఇప్పుడు అదే బాటలో ఈ బ్యూటీ కూడా నడుస్తోంది. అమ్మడికి ఇప్పటికే బోలెడంత పబ్లిసిటీ వచ్చేసింది. 'ఛలో' సినిమా నుండి విడుదలైన కొన్ని స్టిల్స్‌ని బట్టే అమ్మడు ఎట్రాక్ట్‌ చేసేస్తోంది. ఇక సినిమా విడుదలైతే ఇంకెంత మ్యాజిక్‌ చేస్తుందో చూడాలి మరి. త్వరలోనే 'ఛలో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. వస్తూ వస్తూనే రెండు సినిమాల్లో ఆఫర్స్‌ దక్కించుకుంది. 

నాగశౌర్య 'ఛలో' సినిమా ఒకటైతే, 'అర్జున్‌రెడ్డి'తో సెన్సేషనల్‌ అయిన హీరో విజయ్‌ దేవరకొండతో మరోటి. విజయ్‌ దేవరకొండ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. అలా ఈ బ్యూటీ ఈ ఏడాది చివర్లోనైనా కానీ, పరచయానికి ముందే సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించుకుంటోంది. ఇక సినిమా విడుదలైతే ఈ బ్యూటీ పేరు ఇంకెంతగా మార్మోగిపోనుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS