రవితేజకి భారీగా పెరిగిన హిందీ మార్కెట్

మరిన్ని వార్తలు

మాస్ మహారాజ రవితేజ తాజా చిత్రం యువ దర్శకుడైన సోగ్గాడే చిన్ని నాయన & రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాల దర్శకుడైన కళ్యాణ్ కృష్ణ తో చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తికాకుండానే సినిమా బిజినెస్ మొదలైపోయింది. 

ఆ వివరాల్లోకి వెళితే, ప్రముఖ టీవీ నెట్వర్క్ అయిన సన్ టీవీ ఈ చిత్రం తాలుకా శాటీలైట్, డిజిటల్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ ని దక్కించుకుంది. దీనంతటికి కలిపి సుమారుగా రూ 25కోట్ల మేర చెల్లించినట్టు తెలిసింది. రవితేజ కి ట్రేడ్ పరంగా మంచి మార్కెట్ ఉండడం వల్ల ఇంతటి ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగింది అని చెబుతున్నారు. 

అయితే మొన్నటి చిత్రం టచ్ చేసి చూడు ఫ్లాప్ అయినప్పటికీ ఇంతటి ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడం నిజంగా విశేషం అనే చెప్పాలి. దీన్నిబట్టి రవితేజ సినిమా కి ఉన్న క్రేజ్ తెలిసిపోతునండి.

ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నది, త్వరలోనే షూటింగ్ పూర్తీ చేసి చిత్రాన్ని విడుదల చేయాలనీ దర్శక-నిర్మతాహాలు భావిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS