'సైరా' అదంతా ఉత్తదేరా..!

మరిన్ని వార్తలు

మెగా ఫ్యామిలీ సినిమాలకు గాసిప్స్‌ మామూలే. తాజాగా మెగాస్టార్‌ 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' విషయంలోనూ పలు రకాల గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. సినిమా అనుకున్పప్పటి నుండీ గాసిప్స్‌ వస్తూనే ఉన్నాయి ఈ సినిమాకి. డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి ఈ సినిమా డైరెక్షన్‌ నుండి తప్పుకున్నాడట.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ హ్యాండిచ్చాడట. ఇతర టెక్నీషియన్లు కూడా మారిపోయారట.. కొంతమంది ప్రముఖ నటీనటులు తమ డేట్స్‌ ఇవ్వలేదట.. అంటూ ఒకదానిపై ఒకటి గాసిప్స్‌ వస్తూనే ఉన్నాయి. 

కానీ అదంతా ఉత్తిదేనంటూ చిత్ర యూనిట్‌ డిక్లర్‌ చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే సినిమా తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఔట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందంటున్నారు. రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ త్వరలోనే స్టార్ట్‌ చేయనున్నారట. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిర్మాతగా చరణ్‌ తనకి చాలా ఫ్రీడమ్‌ ఇచ్చాడనీ, 'ధృవ' టైంలోనే చరణ్‌తో తనకు సాన్నిహిత్యం బాగా కుదిరిందనీ, 'సైరా'ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నాననీ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి అంటున్నారు. మరోపక్క చిరంజీవి ఫిట్‌నెస్‌ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఈ వయసులో ఆయన కమిట్‌మెంట్‌ తీరు చూసి సురేందర్‌ రెడ్డి ఆశ్యర్యపోతున్నారట. 

ఈ సినిమాకి మొదట్లో రెహమాన్‌ మ్యూజిక్‌ అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల రెహమాన్‌ తప్పుకున్నాడు. హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ముందుగా అనుకున్న విధంగానే బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ కీలకపాత్రలో పోషిస్తున్నారు. ఏది ఏమైనా నిప్పులేకుండా పొగ రాదంటారు. కానీ సినిమా రంగానికి వచ్చేసరికి ఈ సామెత పూర్తిగా చెల్లదనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని విషయాల్లో గాసిప్స్‌ నిజమవుతుంటాయి. కొన్ని విషయాల్లో బెడిసికొడుతుంటాయి. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS