కన్‌ఫ్యూజన్‌లో మెగా మేనల్లుడు

మరిన్ని వార్తలు

భారీ అంచనాల నడుమ విడుదలైన 'ఇంటెలిజెంట్‌' సినిమా మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ని భారీగా నిరాశపరిచింది. అంతకు ముందు వచ్చిన 'జవాన్‌' ఫర్వాలేదనిపించినా, 'సుప్రీమ్‌' తరహా మాస్‌ హిట్‌ కొట్టాల్సి అవసరం ఉంది ప్రస్తుతం మెగా మేనల్లుడికి. సీనియర్‌ డైరెక్టర్‌ అయిన వినాయక్‌లాంటి దర్శకుడితోనే ఫెయిల్యూర్‌ చవిచూసిన తేజు ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం ఎలాంటి కథని ఎంచుకోవాలి? ఏ డైరెక్టర్‌ని ఎంచుకోవాలి అనే ఆలోచనలో పడ్డాడట. 

ఆ దిశగా కొన్ని కొత్త స్టోరీలు, కొత్త కొత్త దర్శకులను ట్రై చేస్తున్నాడనీ సన్నిహితుల సమాచారమ్‌. ఈ క్రమంలోనే ఏదైనా ప్రయోగంతో సాహసం చేయాలా అని కూడా యోచిస్తున్నాడట. అయితే ప్రయోగాలు అన్ని వేళలా వర్కవుట్‌ కావు. అసలే ప్రస్తుతం తేజు టైం బాగోలేదు. ఎంత పవర్‌ ఫుల్‌ సబ్జెక్ట్‌ అనుకున్నా కానీ, బెడిసికొట్టేస్తోంది. సో ఆచి తూచి వ్యవహరించాలని అనుకుంటున్నాడట. ఈ విషయమై పెద్ద మేనమామ చిరంజీవి సలహాలు కూడా తీసుకుంటున్నాడనీ తెలుస్తోంది. కొంచెం గ్యాప్‌ తీసుకుని సరైన కథని ఎంచుకోమని తేజుకి, చిరంజీవి సలహా ఇచ్చాడట. ఆ దిశగా రీఫ్రెష్‌మెంట్‌లో తేజు ఉన్నాడనీ తెలియవస్తోంది. 

అలాగే కొత్త కథలు వినడానికి కూడా టైం కేటాయిస్తున్నాడట. ఈ సారి తేజు నుండి రాబోయే చిత్రం పక్కా మాస్‌ హిట్‌ అయ్యేలా, తగిన స్టోరీని ఎంచుకోవాలని తేజు భావిస్తున్నాడట. ఏమో చూడాలి మన మెగా మేనల్లుడు ఈ సారి ఏం చేస్తాడో! మరో పక్క మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ సైలెంట్‌గా దూసుకెళ్లిపోతున్నాడు. 'ఫిదా'తో ఆల్రెడీ హిట్‌ కొట్టాడు. లేటెస్టుగా 'తొలిప్రేమ'తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసేసుకున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS