మాస్‌, సూపర్‌ మాస్‌ 'ఇంటెలిజెంట్‌'

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ సూపర్‌ మాస్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు 'ఇంటెలిజెంట్‌' సినిమా కోసం. టైటిల్‌ చాలా సాఫ్ట్‌గా అన్పిస్తోంటే, క్లాస్‌ టచ్‌తో ఉంటే సినిమాలో హీరో క్యారెక్టర్‌ మాత్రం మహా మాస్‌గా ఉండబోతోందట. వినాయక్‌ అంటేనే మాస్‌ చిత్రాలకు పెట్టింది పేరు. ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిక్స్‌ చేసి మాస్‌ని మెప్పించడంలో వినాయక్‌ రూటే సెపరేటు. అలాంటి వినాయక్‌ డైరెక్షన్‌లో సాయిధరమ్‌ తేజ్‌ చేస్తున్న సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ హై రేంజ్‌లోనే ఉంటాయి. 

సినిమా టైటిల్‌ కోసం చాలా 'వేట' సాగింది. 'ధర్మా భాయ్‌' అనే టైటిల్‌ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. దానికంటే 'ఇంటెలిజెంట్‌' అయితేనే పెర్‌ఫెక్ట్‌గా కథకు సూటవుతుందని భావించి చివరికి అదే టైటిల్‌ కన్‌ఫామ్‌ చేశారు. టైటిల్‌ డిజైన్‌లో సాయిధరమ్‌ తేజ్‌ లుక్‌ చాలా మాస్‌గా చూపించడంతోనే సినిమాలో కంటెంట్‌ ఎంత మాస్‌గా ఉంటుందో దర్శకుడు వినాయక్‌ చెప్పకనే చెప్పేశాడు. ఇప్పుడు ఫస్ట్‌ లుక్‌ కూడా వచ్చేసింది. సగం మాస్‌ టచ్‌తో కనిపిస్తోంటే ఇంకో సగం 'ఇంటెలిజెంట్‌' టైటిల్‌కి తగ్గట్టుగా ఇంగ్లీష్‌ లెటర్స్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో మిక్స్‌ చేసేశారు హీరో ఫొటోతో. ఇన్నోవేటివ్‌ డిజైన్‌ అనే ప్రశంసలు ఇప్పుడీ ఫస్ట్‌ లుక్‌కి దక్కుతున్నాయి. 

'విన్నర్‌' సినిమా ఫర్వాలేదన్పించినా వసూళ్ళ పంట పండించలేకపోయింది. 'జవాన్‌' సినిమా కూడా టాక్‌ కొంచెం బాగానే రాబట్టుకున్నా నిలదొక్కుకోలేకపోయింది. మళ్ళీ 'సుప్రీం' లాంటి మ్యాజిక్‌ తేజు, ఈ సినిమాతో చేస్తాడని, వినాయక్‌ ఆ మ్యాజిక్‌ని మరింత రసవత్తరంగా చూపించబోతున్నాడనీ ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ నుంచి సమాచారమ్‌ అందుతోంది. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ వాచ్‌ ఈ 'ఇంటెలిజెంట్‌' ఏం చేస్తాడో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS