మెగా మేనల్లుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశాడు!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు అలియాస్ సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ తాజా చిత్రం జవాన్ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది. 

ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1వ తేదిన విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ చిత్రంలో సాయి ధరం తేజ్ సరసన వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మెహ్రీన్ నటిస్తున్నది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకుల్లో జవాన్ పైన అంచనాలు పెంచేసింది.

ఇక జవాన్ చిత్ర కథ ఫ్యామిలీ రిలేషన్స్ తో నిండి ఉంటుంది అని ఈ చిత్రంలో కొత్త సాయి ధరం తేజ్ ని చూస్తారు అని ఈ చిత్ర దర్శకుడైన BVS రవి చెబుతున్నాడు.

ఈమధ్య కాలంలో సరైన హిట్ లేక భాదపడుతున్న సాయి ధరంకి ఈ చిత్రం హిట్ ఇవ్వాలని కోరుకుందాం..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS