మెగా జోడీ అదిరింది

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్‌ మూవీ 'జవాన్‌'. బి.వి.ఎస్‌.రవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే 'విన్నర్‌' సినిమాతో సక్సెస్‌ అందుకున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రతీ ఇంటికి జవాన్‌లాంటోడు ఖచ్చితంగా ఉండాలనేది ఈ సినిమా కాన్సెప్ట్‌. కూల్‌ అండ్‌ లవ్‌లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోందట. వినోదానికి పెద్ద పీట వేశారు ఈ సినిమాలో. అసలే తేజు బాడీ లాంగ్వేజ్‌కి కామెడీ బాగా కనెక్ట్‌ అవుతుంది. అందుకే ఈ సినిమాలో వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనీ సమాచారమ్‌. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన క్యూట్‌ బేబీ మెహరీన్‌ కౌర్‌ ఈ సినిమాలో తేజుతో జత కడుతోంది. లేటెస్టుగా ఈ సినిమాలోని తేజు - మెహరీన్‌కౌర్‌ జంటగా ఉన్న స్టిల్స్‌ బయటికి వచ్చాయి. ఈ జంట చాలా బాగుందని టాక్‌ వినిపిస్తోంది. పెయిర్‌ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఓ సాంగ్‌కి సంబంధించిన స్టిల్స్‌ ఇవి. చాలా క్యూట్‌గా ఎట్రాక్టివ్‌గా ఉంది ఈ జంట అంటున్నారంతా ఈ స్టిల్స్‌ చూసి. సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సినిమా కోసం తన గెటప్‌ కొంచెం ఛేంజ్‌ చేసినట్లు కనిపిస్తోంది. గెటప్‌ సంగతి పక్కన పెడితే, సినిమా మాత్రం ఆకట్టుకుంటుందంటున్నాడు తేజు. అంతేకాదు మేనమామ మేనరిజమ్‌తో ఏ రకమైన డాన్సులైనా ఇరగదీసే తేజు ఈ సినిమా కోసం కొత్త రకం డాన్స్‌ స్టెప్పులు ట్రై చేశాడట. ఫ్లోర్‌ దద్దరిల్లాల్సిందేనట ఆ డాన్సులకి. కాస్కోండి మరి త్వరలోనే రానున్నాడు 'జవాన్‌'గా మన మెగా మేనల్లుడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS