'విన్నర్‌' రేసింగులు అదిరిపోయాయ్‌

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'విన్నర్‌'. ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓపెనింగ్స్‌ అదిరిపోయాయ్‌. సినిమాకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సాయిధరమ్‌ తేజ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. హార్స్‌ రేసింగ్స్‌ ప్రధాన నేపధ్యంగా వచ్చిన ఈ సినిమాలో రేసింగులు కొత్తగా అనిపించాయంటున్నారు సినిమా చూసినవారంతా. హీరో సాయిధరమ్‌ తేజ డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో కన్పించాడు. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఇంత కొత్తగా కన్పించడానికి అతను చేసిన ప్రయత్నం అభినందనీయం. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా చాలా గ్లామరస్‌గా కన్పించింది. ఆమె పాత్ర కూడా కొత్తగా ఉంది ఈ సినిమాలో. ఈ సినిమాకి మంచి టాక్‌ వస్తోంది. ముఖ్యంగా రేసుల గురించి అందరూ చర్చించుకుంటున్న తీరుకి చిత్ర యూనిట్‌ కూడా మురిసిపోతోంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. 'సుప్రీమ్‌' సినిమాతో అందుకున్న హిట్‌ని, 'తిక్క'తో కొనసాగించలేకపోయినా, మళ్లీ ఆ స్థాయి విజయాన్ని సాయి ధరమ్‌ తేజ్‌కి ఈ సినిమా అందిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఈ సినిమాలోని హార్స్‌ రేసింగుల కోసమే భారీగా ఖర్చు చేశారు. తెలుగు తెరపై ఇదొక కొత్త అనుభూతి అంటున్నారు అంతా. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS