పొరపాటున #RGG2 కథ చెప్పేసిన సమంతా!

మరిన్ని వార్తలు

కొద్దిసేపటి క్రితం జరిగిన రాజు గారి గది 2 చిత్ర ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్ లో నటి సమంతా పొరపాటున కథ లీక్ చేసేసింది!

ప్రెస్ మీట్ విషయాల్లోకి వెళితే, ఈ చిత్రంలో తన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉందని చెబుతూ, ఈ మధ్యనే లీక్స్ పేరిట జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ చిత్ర కథ ఉండనుంది అని చెప్పింది. ఇక దీనితో ఈ మధ్యనే సోషల్ మీడియాలో సంచలనం రేపిన సుచీ లీక్స్ ఆధారంగానే ఈ చిత్ర కథ రూపొందించారు అన్న వార్తలకి బలం చేకూరినట్టయింది.

ఇదే సమయంలో ఈ చిత్ర క్లైమాక్స్ హైలైట్ గా ఉండనుంది అని యూనిట్ మొత్తం చెబుతున్నారు. ఇక సమంతా కూడా ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుంది అన్న నమ్మకం వ్యక్తం చేసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS