షారుఖ్ కి ప్రత్యేక పురస్కారం

మరిన్ని వార్తలు

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులతో పాటు పదుల సంఖ్యలో భారీ పురస్కారాల్ని సొంతం చేసుకున్న ఈ బాలీవుడ్ బాద్షాకి దావోస్ వేదిక జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో (ప్రపంచ ఆర్ధిక సదస్సు)లో గొప్ప సత్కారం లభించింది. 

అదేమనగా- మహిళల, చిన్నారుల హక్కుల కోసం కృషి చేస్తున్న వారికి ఇచ్చే ‘క్రిస్టల్’ పురస్కారాన్ని షారుక్ ఖాన్ కి అందచేశారు. ఇదే సమయంలో ఈ పురస్కారం అందుకున్న షారుఖ్ ఖాన్ ప్రసంగిస్తూ- ఈ పురస్కారం అందుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తున్నది అదే సమయంలో మహిళల, చిన్నారుల హక్కుల కోసం తనవంతు మరింత ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. 

ఇక ఈ అవార్డు అందుకోవడం పట్ల దావోస్ సదస్సులో పాల్గొంటున్న భారతదేశ ప్రముఖులు అలాగే ఆయన అభిమానులు షారుఖ్ ఖాన్ కి అభినందనలు తెలియచేశారు. ఈయనతో పాటుగా హాలీవుడ్ కి చెందిన మరో ఇద్దరు ప్రముఖులు కూడా ఈ క్రిస్టల్ పురస్కారాన్ని అందుకున్న వారిలో ఉన్నారు.

ప్రస్తతం షారుఖ్ ఖాన్ ‘జీరో’ అనే చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులకి కనువిందుచేయనున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS