బేబీ షామిలీ ఈజ్‌ బ్యాక్‌

మరిన్ని వార్తలు

అమ్మమ్మ ఇల్లు అంటే ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఓ ముఖ్య అనుభూతి. చిన్నతనంలో అమ్మమ్మ ఇంటి అనుభూతుల్ని పొందని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకవేళ అలాంటి అనుభూతిని ఎవరైనా మిస్‌ అయ్యుంటే ఏం ఫీల్‌ అవ్వకండి. మా సినిమాని చూడండి. ఆ ఫీల్‌ని హాయిగా అనుభవించండి అంటున్నారు నాగశౌర్య అండ్‌ టీమ్‌. నాగశౌర్య - షామిలీ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'.

 

బేబీ షామిలీగా అందరికీ సుపరిచితురాలైన బేబీ షామిలీ 'ఓయ్‌' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. చిన్నప్పుడు ముద్దులొలికే మాటలతో క్యూట్‌గా ఆకట్టుకున్న ఈ బ్యూటీ హీరోయిన్‌గా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. తొలి సినిమాతోనే విమర్శలు అందుకుంది. హీరోయిన్‌ ఫీచర్స్‌ లేవంటూ, ఫిజిక్‌పై బాగా కాన్‌సన్‌ట్రేషన్‌ చేయాలంటూ కామెంట్స్‌ రావడంతో ఏమనుకుందో ఏమో కానీ, తర్వాత ఈ ముద్దుగుమ్మ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. దాంతో ప్రేక్షకులు ఈ బ్యూటీని మర్చిపోయారు. అయితే ఈ మధ్యనే మళ్లీ ఈ బ్యూటీ పేరు తెరపైకొచ్చింది. 

యంగ్‌ హీరో నాగశౌర్యతో 'అమ్మమ్మగారిల్లు' అనే సినిమాలో నటిస్తోంది షామిలి. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే కంప్లీట్‌ అయ్యిందట. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లవర్స్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. ఈ లుక్‌లో షామిలి కొంచెం సన్నగానే కనిపిస్తోంది. తన క్యారెక్టర్‌ గురించి చెబుతూ, 'నా క్యారెక్టర్‌ ఈ సినిమాలో చాలా కొత్తగాఉంటుంది. సరైన కథలు దొరక్కే ఇన్నాళ్లుగా సినిమాలు చేయలేదు. 

ఇకపై వరుసగా సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాననీ..' షామిలి చెబుతోంది. చూడాలి మరి రెండో సినిమాతోనైనా షాలిని నిలదొక్కుకుంటుందో లేదో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS