'రోబో 2.0' సీక్వెల్‌ కాదు

మరిన్ని వార్తలు

శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రోబో 2.0', రజనీకాంత్‌ - ఐశ్వర్యారాయ్‌ జంటగా తెరకెక్కిన 'రోబో'కి సీక్వెల్‌ అనుకున్నాం ఇంతవరకూ. కానీ ఈ సినిమా ఆ సినిమాకి సీక్వెల్‌ కాదనీ, జస్ట్‌ ఆ సినిమా నుండి క్యారెక్టర్స్‌ మాత్రమే తీసుకున్నాననీ, కథ, కథనాలు అన్నీ పూర్తిగా కొత్తగా ఉంటాయనీ శంకర్‌ తెలిపారు. 'రోబో' కథకీ, 'రోబో 2.0' కథకీ ఎక్కడా పోలికలుండవట. సరికొత్త కథాంశంతో, తెరపై మరో అద్భుతం సృష్టించబోతున్నాడు క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ సౌత్‌లో నటించిన తొలి సినిమా ఇది. ఆయన క్యారెక్టర్‌, గెటప్‌ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పటికే అక్షయ్‌ కుమార్‌ గెటప్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాకి తలను పోలిన మనిషి ఆకారంతో కనిపిస్తాడు అక్షయ్‌ కుమార్‌. అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్ట్‌గా విడుదలైన అమీ జాక్సన్‌ ఫస్ట్‌లుక్‌ బావుంది. లేడీ రోబోగా అమీ జాక్సన్‌ గెటప్‌ సూపర్బ్‌గా ఉంది. విజువల్‌ వండర్‌గా తెరకెక్కబోతోంది 'రోబో 2.0'. రోబో సినిమాని మించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఈ సినిమాలో ఉండబోతున్నాయట. దీపావళికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్‌ వర్క్స్‌కి ఇంకా టైం పడుతుండడంతో, సినిమా విడుదల వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్‌ అయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS