హాట్‌ అండ్‌ 'లవ్‌లీ' - అవకాశాలేవీ!

మరిన్ని వార్తలు

తెలుగులో తొలి సినిమాతో 'క్యూట్‌ క్యూట్‌'గా కుర్రకారుకి గాలమేసిన ఈ 'లవ్‌లీ' బ్యూటీ, హీరోయిన్‌గా మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది. సేమ్‌ టు సేమ్‌ అక్కలాగానే. పేరు తెలుసు కదా, శాన్వి. ఆమె అక్క విదిశ కూడా పలు తెలుగు సినిమాల్లో నటించింది. గ్లామర్‌ పరంగా చూస్తే అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకరికొకరు తక్కువేం కాదు. కానీ అదృష్టమే కలిసి రావడంలేదు. ప్రస్తుతం శాన్వి, విదిశ ఇద్దరూ కన్నడ సినిమాల్లోనే సెటిలైపోయారు. అక్క విదిశ తెలుగులో అల్లరి నరేష్‌ సరసన 'అత్తిలి సత్తిబాబు' సినిమాలో నటించింది. విదిశ సంగతి పక్కన పెడితే, శాన్వి కన్నడలో ఇప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలోనే పేరు తెచ్చుకుంది. తెలుగు సినిమాల్లో ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నానంటోంది ఈ బ్యూటీ. ఫొటోలో ఈ బ్యూటీ పోజు చూస్తోంటే గ్లామర్‌కి 'సై' అని చెప్పకనే చెబుతున్నట్లుంది కదా? ఆ గ్లామరూ చూపించాల్సిన స్థాయిలో చూపించేసినా సరే, గ్లామరొక్కటే సరిపోదు. ఒక్క ఛాన్స్‌ చాలు, స్టార్‌డమ్‌ వచ్చేయడానికంటోన్న ఈ 'లవ్‌లీ' బ్యూటీ, ఈ ఏడాదిలో ఖచ్చితంగా ఓ తెలుగు సినిమాలో నటిస్తానంటోంది. ఆ ఛాన్స్‌ దొరుకుతుందా మరి? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS