శర్వానంద్‌, అనుపమ.. అదిరిందిలే!

మరిన్ని వార్తలు

ఓ సినిమా హిట్టవుతుందనడానికి ఆ సినిమా టైటిల్‌ చూస్తే సరిపోతుంది ఒక్కోసారి. ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేస్తుంటుంది ఇంకోసారి. సక్సెస్‌ కళ ఓ సినిమాకి ఉందనడానికి కాంబినేషన్‌ దగ్గర్నుంచి చాలానే కన్పిస్తాయి. అలా 'శతమానం భవతి' సినిమాకి హిట్టు కళ కన్పిస్తుందనడానికి ఎన్నయినా చెప్పుకోవచ్చు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా షూర్‌ షాట్‌ సూపర్‌ హాట్‌ అయ్యేలా ఉంది. టైటిల్‌తో సగం హిట్‌ కొట్టేసింది ఈ సినిమా టీమ్‌. తాజాగా రిలీజ్‌ అయిన ట్రైలర్‌తో నో డౌట్‌, సంక్రాంతి హిట్‌ అని ఇండస్ట్రీ అంటోంది. ఈ సినిమాలో శర్వానంద్‌ డిఫరెంట్‌గా కన్పిస్తున్నాడు, ఈస్ట్‌ గోదావరి యాక్సెంట్‌లో మాట్లాడుతూ. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ యూఎస్‌ నుంచి వచ్చిన మోడ్రన్‌ అమ్మాయిలా కన్పిస్తోంది. వీరిద్దరి మధ్యా లవ్‌ చాలా రొమాంటిక్‌గా తెరకెక్కించినట్టున్నాడు దర్శకుడు. ట్రైలర్‌లోనే ఆ ఫీల్‌ కనిపించింది. ప్రకాష్‌రాజ్‌, జయసుధ కాంబినేషన్‌ 'గోవిందుడు అందరివాడేలే' సినిమాని తలపించింది. ఓవరాల్‌గా సినిమాకి సూపర్‌ హిట్‌ కళ కన్పిస్తోంటే, సినిమా యూనిట్‌కి అంతకన్నా కావాల్సిందేముంది? ఆ పల్లెటూరి వాతావరణం, ఆ పల్లెటూళ్ళో ఉండే కల్మషం లేని మనసుల అభిమానాలు అబ్బో, ఎన్నిసార్లు చూసినా తనివితీరదంతే. అనుపమ తన లుక్స్‌తో ఫుల్‌ మార్క్స్‌ కొట్టేసింది అప్పుడే. ఈ భామ 'అఆ' సినిమాలో పల్లెటూరమ్మాయిలా కన్పిస్తే, ఇందులో చాలా మోడ్రన్‌గా కనిపిస్తోంది. అయినా లంగావోణీలో తళుక్కున మెరిసి చూసేవారినలా తన గ్లామర్‌తో కట్టిపడేస్తోంది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS