పడి పడి లేచే మనసు అంటున్న శర్వా

మరిన్ని వార్తలు

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్ తాజాగా ఒక ప్రేమ కథలో నటిస్తున్నాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది మరో యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి. 

వీరి కలయికలో రానున్న ప్రేమకథా చిత్రానికి ఒక చక్కటి ఫీల్ ఉన్న టైటిల్ ని పెట్టారని సమాచారం. ఆ టైటిల్ ఏంటంటే- పడి పడి లేచే మనసు. ఈ టైటిల్ చూస్తేనే అర్ధమవుతున్నది, ఈ చిత్ర కథలో ఎటువంటి ప్రేమకథని దర్శకుడు మనకి చూపెట్టబోతున్నాడు అని.

అందాల రాక్షసి, క్రిష్ణగాడి వీర ప్రేమ గాధ వంటి చిత్రాలలో ప్రేమకథలని తనదైన శైలిలో చూపించిన హను ఈసారి ఎటువంటి శైలిలో ఈ ప్రేమ కథని ఆవిష్కరించబోతున్నాడు అన్నది చూడాలి. 

ఇక శర్వా కూడా మహానుభావుడు వంటి పెద్ద హిట్ తరువాత చేస్తున్న చిత్రం అవ్వడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS