శ్రద్దాకపూర్‌ రెండో ఇల్లు మీకు తెలుసా?

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ టాలీవుడ్‌లో అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. 'సాహో' సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గర కాబోతోంది. ప్రబాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం బ్యూటీ శ్రద్ధా కపూర్‌ ముంబయ్‌ టు, హైద్రాబాద్‌ షటిల్‌ సర్వీస్‌ చేస్తోంది. అయితే హైద్రాబాద్‌ వస్తుంటే, తనకి తన సొంతింటికి వస్తున్నట్లే అనిపిస్తోందంటోందీ ముంబయ్‌ ముద్దుగుమ్మ. ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు తనకి ఎంతగానో నచ్చేశాయంటోంది. షూటింగ్‌లో కొంచెం టైం దొరికినా ప్రబాస్‌తో చెట్టాపట్టాలేసుకుని రెస్టారెంట్స్‌కి వెళ్లి తనకి నచ్చిన ఫుడ్‌ ఐటెమ్స్‌ లాగించేస్తోందట. హైద్రాబాదీ రుచులు శ్రద్ధాకి భలే నచ్చేశాయట. సో టైం దొరికితే చాలు హైద్రాబాదీ బిర్యానీ స్పెషల్‌గా తెప్పించుకుని తింటోందట ఈ బ్యూటీ. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది 'సాహో' సినిమా. సుజీత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మాంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. హీరోయిన్‌ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంది ఈ సినిమాలో. అందుకే ఏరి కోరి శ్రద్ధా కపూర్‌ని ఎంచుకున్నారు చిత్ర యూనిట్‌. అమ్మడికి మార్షల్‌ ఆర్ట్స్‌, తదితర అంశాలపై మంచి పట్టుంది. సో ఆన్‌ స్క్రీన్‌ యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసేస్తుందీ బ్యూటీ. ఆల్రెడీ 'బాఘీ'లో హీరో టైగర్‌ ష్రాఫ్‌కి ధీటుగా యాక్షన్‌ సీన్స్‌ అదరగొట్టేసింది. అలాగే ఈ సినిమాలో కూడా ప్రబాస్‌తో పాటు, శ్రద్ధాకి యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్నాయనీ సమాచారమ్‌. ఇకపోతే బాలీవుడ్‌లో సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో నటిస్తోంది శ్రద్ధా కపూర్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS