నిర్మాత ని చెప్పుతో కొడతా అన్న హీరోయిన్..!

మరిన్ని వార్తలు

ఈ మధ్య కాలంలో ఆడవారు తమకి జరుగుతున్న అన్యాయాల పట్ల స్పందించడానికి ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రయత్నం చేసే వాళ్ళు తమకి ఆ ప్రయాణంలో ఎదురయ్యే చేదు సంఘటనల గురించి బహిరంగంగా వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాము.

తాజాగా ఇదే జాబితాలో చేరింది కన్నడ హీరోయిన్ శృతి హరిహరణ్ తనకి ఓ తమిళ నిర్మాత ద్వారా ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే, తాను నటించిన ఓ కన్నడ సినిమా తమిళ హక్కులని ఓ తమిళ నిర్మాత దక్కించుకుని, ఆ సినిమాలో తననే హీరోయిన్ గా తీసుకోవాలంటే తనతో పాటు తన సహచర నిర్మాతలకి కావలసినప్పుడు శారీరకంగా సహకరించాలి అని కోరినట్టు తెలిపింది.

దానికి ఆమె వెంటనే చెప్పుతో కొడతాను అని సమాధానమిచ్చినట్టు తెలిపింది. ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలు ఇటు కన్నడ చిత్ర పరిశ్రమ, అటు తమిళ పరిశ్రమ కూడా సంచలనంగా మారింది.

ఏదేమైనా ఈరోజుల్లో ఇటువంటి ఆరోపణలు సాధారణమైపోయాయి అన్నది నిర్వివాదాంశం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS