చిరు 151 గురించి లీక్ ఇచ్చిన సుకుమార్!

మరిన్ని వార్తలు

సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించి అందులో కొత్త దర్శకులని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్న క్రమంలో దర్శకుడు సుకుమార్ తాజాగా నిర్మించిన చిత్రం దర్శకుడు.

ఇక ఈ దర్శకుడుకి సంబందించిన ఆడియో విడుదల కార్యక్రమం నిన్న జరిగింది. ఈ వేడుకకి రామ్ చరణ్ తో పాటుగా ఫిలిం ఇండస్ట్రీ లో ఆయన సన్నిహితులు, స్నేహితులు కూడా చాలా మందే పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సుకుమార్ స్నేహితుడైన తోటి దర్శకుడు సురేందర్ రెడ్డి గురించి మాట్లాడుతూ- సూరి దగ్గర ఎమోషనల్ గా కథ చెప్పే టాలెంట్ ఉంది అని అది ఈ మధ్యనే చిరంజీవి గారు నటించబోయే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథలోని కొన్ని సన్నివేశాలు చెబుతుంటే తమ రోమాలు నిక్కపోడుచుకున్నాయి అని చెప్పాడు.

చాలా పవర్ ఫుల్ సీన్స్ ఉంటాయి అని అలాగే వాటిని సూరి చాలా బాగా తెరకెక్కించగలడు అని చెప్పాడు. దీనితో ఒక్కసారిగా చిరంజీవి 151వ చిత్రం పైన అంచనాలు పెరిగిపోయాయి.

వచ్చే నెలలో ప్రారంబమయ్యే ఈ చిత్రం గురించిన సుకుమార్ ఇచ్చిన ఈ చిన్న లీక్మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిని పదింతలుచేసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS