అతడు - ఆమె ఓ హాట్‌ ఫోటో షూట్‌

మరిన్ని వార్తలు

డబూ రత్నాని క్యాలెండర్‌పై అందాల భామలు హాట్‌ హాట్‌ పోజులతో రెచ్చిపోయి అందాలారేస్తూ, కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంటారు. తాజాగా ఈ ఫోటోలో సన్నీలియోన్‌ కూడా అదే చేస్తోంది. డబూ రత్నాని క్యాలెండర్‌ కోసం చేసిన ఫోటో షూట్‌లో సన్నీలియోన్‌ పోజు కెవ్వుకేక పుట్టిస్తోంది. మాప్‌తో ఫ్లోర్‌ క్లీన్‌ చేస్తున్నట్లుగా ఉన్న సన్నీలియోన్‌ ఫోటో ఇది. 

ఈ ఫోటోలో సన్నీలియోన్‌ హాట్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో కనిపిస్తోంది. అసలే పొట్టి డ్రస్సు వేసుకున్న సన్నీలియోన్‌. ఆ డ్రస్సుని మరింత హాట్‌గా డిజైన్‌ చేస్తున్నాడు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఓ పక్క. ఇంకో పక్క సన్నీలియోన్‌ భర్త డేనియల్‌ ఫ్లోర్‌పై మాప్‌ని సరిచేస్తున్నాడు. సన్నీలియోన్‌ హాట్‌ హాట్‌ పోజులన్నీ ఓ ఎత్తు. ఈ పోజు ఒక్కటీ ఇంకో ఎత్తు అన్నట్లుగా ఉందీ పోజు. ఇదిలా ఉండగా ఈ హాట్‌ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు, దక్షిణాది సినిమాలపై కూడా బాగా కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తోంది. 

మొన్నీమధ్యనే తెలుగులో 'గరుడవేగ' చిత్రంలో ఐటెం సాంగ్‌లో చిందేసి, తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టిన సన్నీలియోన్‌, ఇప్పుడు పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా నటిస్తోంది. అదే 'వీరమహాదేవి' సినిమా. మొదట్లో ఈ సినిమాని చారిత్రాత్మక చిత్రంగా ప్రచారం చేశారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ చూస్తే ఇదేదో అడల్ట్‌ కంటెన్ట్‌ మూవీ అనే భావన కలిగింది ఆడియన్స్‌కి. చూడాలి మరి ఈ సినిమా ఏ తరహాదో. ఇదిలా ఉండగా, ఫ్యాషన్‌, ట్రెండింగ్‌, ఎలిగెన్స్‌, అంటూ బోలెడన్ని ఆన్‌లైన్‌ బిజినెస్‌లను నిర్వహిస్తుంటుంది సన్నీలియోన్‌.  లేడీస్‌ ఫ్యాషన్‌ ఐటెమ్స్‌ అన్నీ వీటిలో రీజన్‌బుల్‌ ధరలకే లభిస్తుంటాయి. 

'స్టార్‌స్ట్రక్‌ బై సన్నీలియోన్‌' అనేది కూడా వన్‌ ఆఫ్‌ ది బిజినెస్‌ ఆఫ్‌ సన్నీలియోన్‌. ఇలా ఓ పక్క సినిమాలు, మరో పక్క ఆన్‌లైన్‌ బిజినెస్‌, అప్పుడప్పుడూ ఇదిగో ఇలా క్యాలెండర్‌పై హాట్‌ హాట్‌ పోజులతో సన్నీలియోన్‌ సూపర్‌ బిజీగా గడిపేస్తూంటుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS