ఎన్టీఆర్ గా హీరో సూర్య?

మరిన్ని వార్తలు

వైవిధ్యమైన పాత్రలతోనే పాటుగా మంచి కమర్షియల్ హీరోగా సైతం ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న హీరో సూర్య. 

ఇక ఆయన తాజాగా మహానటి సావిత్రి జీవితం పైన రూపొందిస్తున్న ‘మహానటి’ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించనున్నాడు అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇంతకి ఆ పాత్ర ఎవరిదంటే- విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారిది. 

అయితే దీని పైన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికే తన నటనతో అత తమిళ ప్రేక్షకులని ఇటు తెలుగు ప్రేక్షకులని అలరించిన సూర్య ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రలో చేయనున్నారు అని తెలిసి ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. 

మొత్తానికి ఇటువంటి ఒక ఛాలెంజింగ్ పాత్రలో ఆయన చూడనుండడం అందరికి ఆసక్తిరేపే అంశం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS