టాక్ అఫ్ ది వీక్- అమ్మమ్మగారిల్లు & నేల టిక్కెట్టు

మరిన్ని వార్తలు

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రెండు చిత్రాలు- నేల టిక్కెట్టు & అమ్మమ్మగారిల్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాయి. మరి ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల మనసులని ఎంతవరకు గెలుచుకున్నాయి అన్నది ఈ క్రింద చూద్దాం..

ముందుగా మాస్ మహారాజ రవితేజ నేల టిక్కెట్టు గురించి మాట్లాడుకుందాం. వరుస హిట్స్ కొట్టిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో రవితేజ చేసిన ఈ చిత్రం ఈ ఇద్దరికి చేదు అనుభవాన్నే మిగిలిచినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే- సినిమా ఆద్యంతం కొత్తదనం లేకపోవడమే కాకుండా సినిమా చూస్తున్న ప్రేక్షకుడి సహనానికి కూడా ఇదొక పరీక్షలా ఉంటుంది.

ఆడియన్స్ ఊహించగలిగే ట్విస్టులు, రొటీన్ సన్నివేశాలు, కథలో బలం లేకపోవడం ఈ చిత్రాన్ని సరైన దిశలో నడపలేకపోయాయి. ఇదే సమయంలో రవితేజ ఒక్కడే సినిమాని నేట్టుక్కురాలేకపోయాడు అన్నది నిజం. మొత్తానికి ఈ చిత్రం ఇటు ఆడియన్స్ కి అటు యూనిట్ కి తీవ్ర నిరాశనే మిగిల్చింది.

ఇక రెండవ చిత్రం- అమ్మమ్మగారిల్లు. ఈ సినిమా టైటిల్ బట్టే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమా అని. డైరెక్టర్ సుందర్ కూడా ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్నితీశాడు. ముఖ్యంగా ఈ చిత్ర కథలో కుటుంబం, బంధాలు, అనుబంధాలు ఇలా ఒక ఫ్యామిలీ సినిమాలో ఏమేమి ఉండాలో అవన్నీ అమర్చి ఈ చిత్రం తీశాడనిపిస్తుంది.

ఇది ఒక గొప్ప సినిమా కాకపోయినా, ధియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకుడి మాత్రం విసుగుతెప్పించదు అని మాత్రం చెప్పొచ్చు. సమ్మర్ లో ఇటువంటి సినిమాలకి ఆదరణ లభించే అవకాశాలు ఎక్కువే...

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS