ఎమ్మెల్యేతో మిల్కీ 'డాన్స్‌' కెవ్వుకేక

మరిన్ని వార్తలు

ఎంసీఏ అంటే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌. ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలున్న అబ్బాయ్‌. కొత్త డెఫినిషన్స్‌ పుట్టుకొచ్చేస్తున్నాయ్‌ సినిమాలతో. ఎంసీఏ ప్రేక్షకుల్ని మెప్పించింది. ఎమ్మెల్యే ఇంకా బాగా అలరించనుందేమో చూడాలి. ఈ 'ఎమ్మెల్యే' నందమూరి కళ్యాణ్‌రామ్‌ అని తెలుసు కదా. 

తొలిసారిగా నందమూరి కళ్యాణ్‌రామ్‌తో జతకడ్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా, ఈ సినిమాలో సూపర్బ్‌ సాంగ్‌ ఇటీవల షూట్‌ పూర్తి చేసుకుందట. బెస్ట్‌ ఎవర్‌ డాన్స్‌ పార్ట్‌నర్‌ అంటూ కళ్యాణ్‌రామ్‌పై పొగడ్తలు కురిపించేసింది మిల్కీ బ్యూటీ. కళ్యాణ్‌రామ్‌ మంచి డాన్సరే. కానీ ఆ డాన్స్‌లు అంతగా ఎలివేట్‌ అవలేదు. కారణం సూపర్బ్‌గా డాన్స్‌ చేసిన కొన్ని సినిమాలు ఫెయిల్‌ అవడమే. నందమూరి ఫ్యామిలీలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సూపర్బ్‌ డాన్సర్‌ అయితే, తారకరత్న కూడా డాన్సుల్లో తనదైన ముద్ర వేశాడు. 

ఎన్టీఆర్‌ అన్నయ్య అయిన కళ్యాణ్‌ రామ్‌ కూడా డాన్సుల్లో సత్తా చాటేయగలడు. ఈసారి 'ఎమ్మెల్యే'తో తాను ఎంత మంచి డాన్సరో ప్రూవ్‌ చేసుకోనున్నాడట కళ్యాణ్‌రామ్‌. మిల్కీ బ్యూటీ అనగానే ముందుగా ఆమె అందంతోపాటుగా, అత్యద్భుతమైన డాన్సర్‌ కూడా గుర్తుకొస్తుంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో టాప్‌ 3 డాన్సర్స్‌ అంటే అందులో ఖచ్చితంగా తమన్నా పేరుంటుంది.

 

అలాంటి తమన్నా, బెస్ట్‌ డాన్స్‌ పార్టనర్‌ అని కళ్యాణ్‌రామ్‌ గురించి చెప్పిందంటే, 'ఎమ్మెల్యే' సినిమాలో డాన్సులు ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కొంచెం రాజకీయాలు, ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌, సూపర్బ్‌ యాక్షన్‌, కాసిన్ని మాస్‌ ఎలిమెంట్స్‌తో 'ఎమ్మెల్యే' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS