సల్మాన్‌పై కన్నేసిన తాప్సీ

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ అంటే ఎవ్వరికిష్టముండదు చెప్పండి. అందులోనూ అమ్మాయిలకైతే మరీను. ఈ కండలవీరుడు బాలీవుడ్‌లో చాలా మంది ముద్దుగుమ్మలకి లైఫ్‌ ఇచ్చాడు. సల్మాన్‌ చెయ్యి పడితే ఆ హీరోయిన్‌ దశ తిరిగినట్లే. అందుకే ఇప్పుడు ఈ హ్యాండ్‌సమ్‌ హీరో ముద్దుగుమ్మ తాప్సీని ఎట్రాక్ట్‌ చేస్తున్నాడట. చిన్నప్పట్నుంచీ తనకి సల్మాన్‌ అంటే ఎంతో ఇష్టమని చెబుతోంది ముద్దుగుమ్మ తాప్సీ. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో హవా చూపిస్తోంది. అయినా కానీ ఇంతవరకూ సల్మాన్‌ని కలవడం కుదరలేదట తాప్సీకి. ప్రస్తుతం తాప్సీ 'జుద్వా 2' సినిమాలో నటిస్తోంది. గతంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన 'జుద్వా'కి సీక్వెలే ఈ సినిమా. అప్పట్లో ఆ సినిమా చూపినప్పట్నుంచీ తాప్సీకీ సల్మాన్‌ అంటే అభిమానం ఏర్పడిందట. చాలా కాలంగా బాలీవుడ్‌లో ఉన్నప్పటికీ ఆయన్ని కలవడం కుదరలేదంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు నటిస్తున్న ఈ 'జుద్వా 2' సినిమా షూటింగ్‌ పూర్తయ్యేలోగా ఆయన్ని కలుస్తానని అంటోంది. ఈ సీక్వెల్‌లో వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తుండగా, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, తాప్సీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో 'జుద్వా' తెరకెక్కించిన డేవిడ్‌ ధావనే ఇంత లాంగ్‌ గ్యాప్‌:తర్వాత ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నట్లు ఈ సినిమా తెలుగులో నాగార్జున నటించిన 'హలో బ్రదర్‌'కి సీక్వెల్‌ అన్న సంగతి తెలిసిందే కదా!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS