కుర్రోడు హిట్‌ కొట్టడానికి రెడీగా ఉన్నాడు

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ. ఈ పేరుకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 'పెళ్లిచూపులు' సినిమాతో ఈ పేరు మార్మోగిపోయింది. ఈ సినిమాలో హీరోగా చేసిన కుర్రోడే విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో మన ముందుకు వస్తున్నాడు. అదే 'ద్వారక' సినిమా. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్‌ చేయించాడు ఈ యంగ్‌ హీరో. శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ మళ్లీ 'పెళ్లి చూపులు' లాంటి హిట్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్‌. 'పెళ్లిచూపులు' సినిమాకి ముందు పలు చిత్రాల్లో నటించాడు విజయ్‌ దేవరకొండ. కానీ 'పెళ్లి చూపులు' సినిమాలో విజయ్‌ దేవరకొండ యాక్టింగ్‌ టాలెంట్‌ చూసిన వారు ఈ హీరో గత చిత్రాలను కూడా ఆస్వాదిస్తున్నారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో నానికి ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు ఈ యంగ్‌ హీరో. 'పెళ్లి చూపులు' సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ వచ్చేసింది విజయ్‌ దేవరకొండకి. ఇక 'ద్వారక' సినిమాకి వస్తే, ఈ సినిమాలో మనోడు బాబా గెటప్‌లో కనిపిస్తాడు. ఓ దొంగ బాబా గెటప్‌ అది. అయితే ఈ దొంగ బాబా గెటప్‌లో విజయ్‌ దేవరకొండ పండించే వినోదం అంతా ఇంతా కాదట. తను ప్రేమించిన అమ్మాయిని ఈ బాబా ఎలా దక్కించుకున్నాడన్నదే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోందట ఈ సినిమాలో. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్‌ వరకూ వెయిట్‌ చేయాల్సిందే మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS