'కత్తి'లాంటి కాంబినేషన్‌ మళ్లీ సెట్టయ్యింది

మరిన్ని వార్తలు

తమిళ హీరో విజయ్‌ నటించిన 'కత్తి' సూపర్‌ డూపర్‌ విజయం సాధించింది. గ్రేట్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమానే తెలుగులో చిరంజీవి 150వ చిత్రంగా రీమేక్‌ చేశారు. అదే 'ఖైదీ నెంబర్‌ 150'. కాగా మురుగదాస్‌ - విజయ్‌ కాంబినేషన్‌ ది బెస్ట్‌ కాంబినేషన్‌. ఈ కాంబినేషన్‌లో వచ్చిన మరో సినిమా 'తుపాకి' కూడా సూపర్‌ హిట్‌ సినిమానే. ఈ సినిమాని తెలుగులోకి డబ్‌ చేశారు. తాజాగా ఈ కాంబినేషన్‌ మళ్లీ సెట్‌ అయ్యింది. 

ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఈ మధ్యే 'మెర్సల్‌' సినిమాతో ఘన విజయం అందుకున్నాడు విజయ్‌. 'అదిరింది' పేరుతో తెలుగులో విడుదలైంది ఈ సినిమా. మురుగదాస్‌ 'స్పైడర్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో తెరకెక్కించిన బైలింగ్వల్‌ మూవీ ఇది. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, మురుగదాస్‌ డైరెక్షన్‌ అంటే అంచనాలు ఆకాశాన్నంటేలానే ఉంటాయి. అందులోనూ విజయ్‌ - మురుగదాస్‌ కాంబో అంటే అతి భారీ అంచనాలు ఇది పక్కా. 

ఈ సినిమాని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. గతంలో రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన 'రోబో' చిత్రాన్ని రూపొందించింది ఈ నిర్మాణ సంస్థే కావడం విశేషం. అంటే ఈ తాజా కాంబోలో తెరకెక్కబోయే చిత్రం అతి భారీ బడ్జెట్‌ మూవీ అని భావించొచ్చు. 'మెర్సల్‌' మూవీతో వివాదాల పాలైనా, సినిమా అయితే రికార్డు హిట్‌ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో విజయ్‌ రేంజ్‌ ఇంకా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు మురుగదాస్‌తో చేయబోయే చిత్రం అంటే అంచనాలు ఊహకందడం లేదు.

సినిమాకి సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS