సప్తగిరి డాన్సులకి వినాయక్‌ ఫిదా

మరిన్ని వార్తలు

కమెడియన్‌ సప్తగిరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. చరణ్‌ లక్కాకుల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. డా.కె.రవికుమార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమాతో కమెడియన్‌ నుండి హీరోగా అవతారమెత్తాడు. తొలి సినిమాతో ఓకే అనిపించుకున్నాడు. 

ఇప్పుడు మళ్లీ తన పేరుతోనే చివర 'ఎల్‌ఎల్‌బి' అనే క్వాలిఫికేషన్‌ని చేర్చి టైటిల్‌గా పెట్టి మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. హీరోగా సప్తగిరి స్పీడు మామూలుగా లేదు. డాన్సులు ఇరగదీసేస్తున్నాడు. ఫైట్లు కుమ్మేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ సాంగ్‌ని డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ రిలీజ్‌ చేశాడు. సాంగ్‌లోని డాన్సులు చూసి వినాయక్‌ షాక్‌ అయ్యాడట. అసలింత డాన్సు సప్తగిరి ఎప్పుడు నేర్చేసుకున్నాడా అని ఆశ్చర్యపోయాడట వినాయక్‌. అంత బాగా డాన్సులేసేశాడు సప్తగిరి. 

ఈ మధ్య ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. టీజర్‌తోనే తన సత్తా చూపించేశాడు మనోడు. మగ జాతి ఆణిముత్యాన్ని నేను అంటూ ఓ సినిమాలో సప్తగిరి పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. ఏ సినిమాలో కనిపించినా, ఏ గెటప్‌ వేసినా సప్తగిరి కామెడీకి నవ్వుల తోటే పూసేస్తుంది. అలాంటిది హీరోగా అంటే ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంటే. అన్నట్లు సప్తగిరి మొదటి సినిమా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' ఆడియో ఫంక్షన్‌కి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిధిగా వచ్చి, తన సపోర్ట్‌ అందించారు సినిమాకి. అంతేకాదు, సినిమా తప్పకుండా చూస్తాననీ మాటిచ్చారు కూడా. అలాగే చేశారు పవన్‌ కళ్యాణ్. 

ఇప్పుడు ఈ సినిమాకి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సపోర్ట్‌ దక్కనుంది. ఈ సినిమా ట్రైలర్‌ని రామ్‌చరణ్‌ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఆ రకంగా సప్తగిరి సినిమాలకి మెగా సపోర్ట్‌ భలే లభిస్తోందిలే. ఈ సినిమాలో ముద్దుగుమ్మ కాషిష్‌ ఓహ్రా సప్తగిరితో జత కడుతోంది. అంతేకాదండోయ్‌ ఈ మధ్య మనోడు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డును కూడా అందుకున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS