ఇక చివరికి తానే చూసుకుంటానని కమల్ చెప్పేశాడు!

మరిన్ని వార్తలు

లోక నాయకుడైన కమల్ హాసన్ వెండితెర పై ఏ ఇతర హీరో చేయని సాహసాలు చేశాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అలాంటి కమల్ హాసన్ కి తను చేసేసినిమాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్న సంఘటనలు కోకొల్లలు. ఈ మధ్య కాలంలో విశ్వరూపం 2 సినిమా విషయంలో కూడా ఇలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకున్నాడు. ఓవర్ బడ్జెట్ అవ్వడంతో విశ్వరూపం మొదటి భాగం రిలీజ్ అయి ఇన్నిరోజుల గడుస్తున్నా రెండవ భాగం వెలుగు చూడలేకపోయింది.

అన్ని ప్రయత్నాలు చేసాక, చివరికి కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నాడు. ఈ ప్రకటన స్వయంగా కమల్ హాసన్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలియచేశాడు.

దీనితో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ విశ్వరూపం 2 నిర్మాణానతర కార్యక్రమాలు చూస్తుందట. ఇక ఈ సినిమా ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయనున్నట్టు కూడా కమల్ స్పష్టంచేశాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS